Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

తెలంగాణపై ఎల్‌నినో ప్రభావం.. ప్రజలకు మంత్రి శ్రీధర్ బాబు కీలక సూచనలు

Sridhar Babu issues key suggestions to people on El Nino effect in Telangana
Advertisement
  • నీరు, విద్యుత్, డబ్బు పొదుపుగా వాడాలని ప్రజలకు సూచన
  • బోర్లలో నీటిమట్టం తగ్గుతోందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి
  • కరువు పరిస్థితులపై ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడి
Advertisement
ఎల్‌నినో ప్రభావం ప్రపంచవ్యాప్తంగా తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు నీరు, విద్యుత్, డబ్బును పొదుపుగా వాడుకోవాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు సూచించారు. భవిష్యత్తులో ప్రకృతి వైపరీత్యాల వల్ల ఇబ్బందులు తలెత్తవచ్చని, ప్రజలు ఇప్పటి నుంచే ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని కోరారు.

ప్రస్తుతం బోరు బావుల్లో నీటిమట్టాలు పడిపోతున్నాయని, రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా మారవచ్చని శ్రీధర్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని యాసంగి పంటలను ఎంచుకోవడంలో రైతులు అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రకృతికి అనుగుణంగా నడుచుకోవాలని హితవు పలికారు. కరువు పరిస్థితులు ఏర్పడితే ప్రజలను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు.

ప్రభుత్వం ప్రజలకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తుందని ఆయన భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను కూడా ఆయన ప్రస్తావించారు. సన్న బియ్యం పంపిణీ, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఉచిత వైద్య సేవలతో పాటు, ఉద్యోగ నోటిఫికేషన్ల ద్వారా ఇప్పటికే సుమారు 70,000 మందికి ఉపాధి కల్పించామని గుర్తుచేశారు.
Advertisement
Advertisement
Sridhar Babu
El Nino Telangana
Water conservation
Telangana agriculture
Revanth Reddy
Yasangi crops

More Telugu News